మాకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి: ఇమాంలు

ప్రొద్దుటూరులో మసీదుల ఇమాములు శుక్రవారం స్థానిక ఈద్గా మస్జిద్‌లో సమావేశం నిర్వహించారు.  షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ & అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ ప్రెసిడెంట్ ముక్తియార్ అధ్యక్షత సమావేశం నిర్వహించారు.
స్థానిక ఎన్నికల్లో ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని,  కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేయించాలని సమావేశంలో చర్చించారు.  ముస్లిం సమాజ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం అవసరమని డిమాండ్ చేశారు.
*ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పెన్షన్ పథకాల వివరాలను ప్రతి మసీదులో ప్రజలకు తెలియజేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు.
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న కరువు పరిస్థితులను అధిగమించి, ప్రజలకు మరియు రైతులకు ఉపశమనం కలిగించే విధంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.  ఈ సమావేశంలో అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ ప్రతినిధులు, ప్రొద్దుటూరులోని వివిధ మసీదుల ఇమాములు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?