ఆశా కార్యకర్తల సేవలు అభినందనీయం: DMHO డా. యుగంధర్

ప్రొద్దుటూరు NGO హోమ్ నందు మంగళవారం ఆశా డే సమావేశం నిర్వహించారు.  DMHO డా. యుగంధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  కల్లూరు, కామనూరు, రాజుపాలెం, ప్రొద్దుటూరు ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  మాతా-శిశు ఆరోగ్యం మరియు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.  DMHO డా.యుగంధర్ మాట్లాడుతూ..  తల్లులు మరియు చిన్నారులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు నిరంతరం అందేలా క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు.  
ఈ కార్యక్రమంలో డిప్యూటీ DMHO డా. గీత,జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డా.ప్రవీణ్ కుమార్, జిల్లా మలేరియా అధికారి డా. ఆరిఫ్,  ప్రోగ్రాం ఆఫీసర్ డా. తాహా, వైద్యాధికారులు డా హనీఫ్ బాబా, డా సుమన్, డా శ్రీనివాసులు, డా నజీర్, డా నాగార్జున, డా భరత్ నారాయణ, డా మురళి కృష్ణ, డా మధు కుమార్, డా మానస, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?