మున్సిపల్ చైర్మన్ పోటీకి సై: ఎమ్మెల్యే సోదరుడు రాఘవరెడ్డి
ప్రొద్దుటూరు: పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవికి ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధమేనని ఎమ్మెల్యే సోదరుడు రాఘవరెడ్డి తెలిపారు. ఆయన సోమవారం స్థానిక మార్కెట్ యార్డు కార్యాలయములో మీడియాతో మాట్లాడారు. ఇటీవల తనపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాను అనని మాటలను అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేయడం తగదని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.