ఖాదర్ హుస్సేన్ మసీదు వీధిలో పరిస్థితి చూడండి.. కమీషనర్ సార్.!

ప్రొద్దుటూరులో పేదలు నివసించే ఖాదర్ హుస్సేన్ మసీద్ వీధిలో పరిస్థితి ఇది.  కాల్వల్లోని మురుగు నీరంతా రోడ్డుపైనే ప్రవహిస్తోంది.  నడవడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.  దుర్వాసన వస్తోందని వాపోతున్నారు. చిన్న పిల్లలకు వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఎక్కువగా పేదలు నివసించే ఈ ప్రాంతంలో రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయి.  డ్రైన్స్ రోజువారీ క్లీన్ చేయడం లేదు.  అధికారులు పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?