ప్రచారం తగ్గిస్తే.. పనులవుతాయి కదా.!
ప్రొద్దుటూరులో రోడ్డన్నీ గోతులు పడ్డాయి. డ్రైన్స్ దెబ్బతిన్నాయి. మోర్ ఎదురుగా కల్వర్టులకు గ్రిల్స్, వెంకటేశ్వరపేటలో ర్యాంపులు పాడై పోయాయి. గాంధీరోడ్డు, వినాయకనగర్ ప్రాంతాల్లో వాటర్ పైప్ లైన్స్ లీకేజీ అవుతున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. కొన్ని ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదు. వీటికి మరమత్తులు సైతం చేయలేదు. పట్టణమంతా దోమలు, పందులు, కుక్కలు, ఆవుల బెడద ఎక్కువైంది. ప్రమాదాలు జరుగుతున్నాయి.
అభివృద్ధికి 15th ఫైనాన్స్ గ్రాంట్స్ వచ్చాయి. పనులు గుర్తించారు. టెండర్లు పిలిచారు. జేసీ సుమారు రూ.10.70 కోట్లతో 49 పనులకు సంతకాలు చేశారు. సమస్యలు తీరేదెప్పుడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.