కొత్త పెన్షన్లు ఎప్పుడిస్తావు బాబు.?: ఐద్వా
ప్రొద్దుటూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా.. ఎన్నికల హామీలు అమలు చేయలేదని ప్రొద్దుటూరు ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు విజయ, ప్రేమ విమర్శించారు
వారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని, వారి తరుపున పోరాటం చేస్తామని హెచ్చరించారు.