ఆ ఉద్యోగిపై అవినీతి ఆరోపణలు.. అధికారి వాటా ఎంత.?

ప్రొద్దుటూరు: మున్సిపల్ ఆర్ఐ రమేష్ పూజ స్కూల్ ఆస్తి యజమాన్య మార్పిడికి రూ.20 లక్షలు ఎత్తాడని, మున్సిపల్ మార్కెట్ కలెక్షన్స్ కొట్టేశాడని గతనెల 3న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి ఆరోపించారు.  ఆ మరుసటి రోజునే ఏప్రిల్ కలెక్షన్స్ ఆర్ఐ రమేష్ మున్సిపల్ ఖజానాకు కట్టాడు.  
దీనిపై చర్యలు తీసుకోవాల్సిన కమిషనర్ ఆ ఉద్యోగికి ఏకంగా పెట్రోల్ బంక్ నిర్వహణ అప్పగించారు.  ఇప్పటికే పెట్రోల్ బంకులో రూ.1.24 కోట్లు ఫ్రాడ్ జరిగి, ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు అరెస్ట్ అయ్యారు.  ఈ పరిస్థితుల్లో అవినీతి ఆరోపణలున్న ఉద్యోగికే అందలం ఎక్కించడపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?