మైనర్ డ్రైవింగ్ పై జరిమానా.. కౌన్సిలింగ్.!
ప్రొద్దుటూరు: మైనర్ డ్రైవింగ్ పై పోలీసులు మంగళవారం సాయంత్రం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్థానిక 1టౌన్ ఎస్సై మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గాంధీరోడ్డులో వాహనాల తనిఖీ చేపట్టారు. మైనర్లు వాహనాలు నడుపుతుండగా 15 మందిని పట్టుకున్నారు. వారి పేరెంట్స్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు. రూ.13,245లు పెనాల్టీ విధించారు. కేసులు నమోదు చేశారు. మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసులు నమోదు చేస్తామన్నారు.