గణేష్ విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లపై ASP విభూకృష్ణ పరిశీలన.!

ప్రొద్దుటూరులో గణేష్ విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లపై ఆదివారం ASP విభూకృష్ణ సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు.  విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాలకు వెళ్లారు.  అక్కడి పరిస్థితులు, ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.  ప్రమాదాల నివారణ, రక్షణ ఏర్పాట్లకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.  కామనూరు, శెట్టిపల్లె, అల్లాడుపల్లె, వెళ్లాల నదీ పరివాహక ప్రాంతాలపై చర్చించారు.  ఫైర్ ఆఫీసర్ బసివిరెడ్డి, సీఐలు నాగభూషణ్, కొండారెడ్డి, వంశీనాథ్, రామాంజనేయుడు, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్, విద్యుత్ శాఖ రూరల్ డిఈ శిరీష, రెవిన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు కమిషనర్ పై హైకోర్టులో పిటిషన్.!

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఏకగ్రీవం.!