9 మంది జూదరుల అరెస్ట్.. రూ.96,520లు స్వాధీనం: ASP విభూకృష్ణ
ప్రొద్దుటూరు గిడ్డంగివీధిలో జూదం ఆడుతున్న వారిపై స్థానిక 1టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. 9 మంది జూదరులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.96,520 నగదు, 8 సెల్ ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించారు. వారందరి పైన ఇది వరకే పాత కేసులు ఉన్నట్లు గుర్తించారు. వారిపై వ్యవస్థీకృత నేరాల చట్టాల క్రింద కేసులు నమోదు చేశారు.
*ASP విభుకృష్ణ సోమవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం గిడ్డంగివీదిలోని ఓ ఇంటిలో జూదం ఆడుతున్న ప్రకాష్ నగర్ చెందిన పెద్దగండ్ల బాలు, షేక్ మహబూబ్ షరీఫ్, KK స్ట్రీట్ సయ్యద్ మహమ్మద్ గౌస్, మత్స్య కాలనీ పసుపుల శ్రీనివాసులు, ఎర్రగుంట్ల రోడ్డులోని పూజారి మాలేపాటి వెంకటసుబ్బయ్య, గడ్డం కేశవ, మీనాపురంకు చెందిన చింతకుంట రామ్మోహన్ నాయుడు, చౌడూరుకు చెందిన మల్లెల నాగేంద్ర, బద్రిపల్లెకు చెందిన చందా పరమేశ్వర రెడ్డిలను 1టౌన్ సీఐ కొండారెడ్డి, ఎస్సై మధుసూదన్ రెడ్డి అరెస్ట్ చేశారన్నారు.