చౌడూరు రైతులకు పాసుపుస్తకాలు: ఎమ్మెల్యే వరద

ప్రొద్దుటూరు: స్థానిక చౌడూరు గ్రామంలో బుధవారం 876 మంది రైతులకు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రాజముద్రతో, క్యూఆర్ కోడ్ కలిగిన, 14 భద్రతా ప్రమాణాలతో పాసుపుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూముల రీ సర్వే పూర్తిచేసి, చౌడూరులో 923 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేసిందన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ కుమార్,  మాజీ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, డీటీ సుదర్శన్, ఆర్ఐ నాగమోహన్ రెడ్డి, సర్వేయర్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?