పెద్దశెట్టిపల్లెలో మంగతాయి.. 7 మంది అరెస్ట్.!

ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దశెట్టిపల్లెలో వ్యవస్థీకృత జూద ముఠా గుట్టురట్టు చేశారు.  7 గురుని అరెస్ట్ చేశారు.  రూ.15,220 నగదు, 52 పేకముక్కలు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
*రూరల్ సీఐ నాగభూషణ్ వివరాల మేరకు..
బుధవారం సాయంత్రం పెద్దశెట్టిపల్లె గ్రామంలోని తళ్ళపురెడ్డి నరసింహారెడ్డి ఇంట్లో అక్రమంగా మంగతాయి పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులకు నమ్మకమైన సమాచారం అందింది. ఈ సమాచారంపై ప్రొద్దుటూరు రూరల్ SI రాజు తన సిబ్బందితో కలిసి సదరు ఇంటిపై దాడి చేసి తనిఖీలు నిర్వహించారు.
*తనిఖీల్లో ఇంటిలోని ప్రత్యేక గదిలో ఏడుగురు వ్యక్తులు గుంపుగా కూర్చొని నగదును పందెంగా పెట్టి “లోపల–బయట” మంగతాయి పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
1. బండి నాగ సుబ్బారెడ్డి, 56 సంవత్సరాలు, పెద్దశెట్టిపల్లె గ్రామం, ప్రొద్దుటూరు మండలం.
2. బండి సానారెడ్డి, 52 సంవత్సరాలు, పెద్దశెట్టిపల్లె గ్రామం, ప్రొద్దుటూరు మండలం.
3. తళ్ళపురెడ్డి నరసింహారెడ్డి, 56 సంవత్సరాలు, పెద్దశెట్టిపల్లె గ్రామం, ప్రొద్దుటూరు మండలం — జూదాన్ని నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకుడు.
4. కొరతాల వెంకట కృష్ణారెడ్డి, 61 సంవత్సరాలు, కాలహస్తయ్య వీధి, ప్రొద్దుటూరు పట్టణం.
5. మోపూరి సాంబశివారెడ్డి, 71 సంవత్సరాలు, నేతాజీ నగర్, ప్రొద్దుటూరు పట్టణం.
6. దూదేకుల పెద్ద సంజీవరాయుడు, 52 సంవత్సరాలు, కొర్రపాడు గ్రామం, రాజుపాళెం మండలం.
7. మాలేపాటి మహేంద్ర, 36 సంవత్సరాలు, బురరుసాదు మటం, ప్రొద్దుటూరు పట్టణం వారిని అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ప్రొద్దుటూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగభూషణ్ మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో పేకాట, మంగతాయి మరియు ఇతర అక్రమ జూద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
అక్రమ జూదం ఆడేవారితో పాటు జూదాన్ని నిర్వహించే వారు, వ్యక్తులను సమీకరించే వారు, జూదం నిర్వహించేందుకు ప్రదేశాలు కల్పించే వారు, ఇతర విధాలుగా సహకరించే వారిపై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు అక్రమ పేకాట, జూద కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని సి.ఐ. నాగభూషణ్ సూచించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?