కొళాయి పన్ను వసూళ్లపై ఈనెల 7-11 వరకు స్పెషల్ డ్రైవ్: మున్సిపల్ కమిషనర్
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పరిధిలో 24,146 కొళాయి కనెక్షన్లు ఉన్నాయని, వీటినుంచి అరియర్స్ పెండింగులో ఉన్నాయని, వీటి వసూళ్లకు ఈనెల 7-11 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్, సచివాలయాల ఉద్యోగులను మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ఆదేశించారు. ఆయన బుధవారం కొళాయి పన్ను వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. వాటర్ వర్క్స్ విభాగంలో 95 మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారని, వారి వేతనాలకే అధిక మొత్తంలో ఖర్చు అవుతోందన్నారు. ఏఈలు సురేందనాథ్ రెడ్డి, దస్తగిరి, వినోద్ పాల్గొన్నారు.