ప్రొద్దుటూరులో 678 విగ్రహాలు ఏర్పాటు: ASP విభూకృష్ణ !
ప్రొద్దుటూరు: వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ASP విభూకృష్ణ ప్రొద్దుటూరు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ పాటిస్తూ, ప్రమాద రహితంగా ప్రతి ఒక్కరూ పండుగ జరుపుకోవాలని సూచించారు. ఆయన పట్టణంలో పలుచోట్ల ప్రజలకు మట్టి గణేష్ ప్రతిమలను పంపిణీ చేశారు.
*ప్రొద్దుటూరులో 678 విగ్రహాల ఏర్పాటు
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఊరూరా, వాడవాడలా
యువకులు ఉత్సాహంగా మండపాలు ఏర్పాటు చేశారు. గణేష్ ప్రతిమలను ప్రతిష్టించారు. అందంగా, ఆకర్షణీయంగా అలంకరించారు. పూజలు నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరులో 678 విగ్రహాలను ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రతి విగ్రహం వద్ద భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. ప్రమాదాల నివారణపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 1టౌన్ PS- 141, 2టౌన్ PS-114, 3టౌన్ PS171, రూరల్ PS-176, రాజుపాలెం PS-76 విగ్రహాలు ఏర్పాటు చేశారు.