ప్రొద్దుటూరులో గంజాపై ఉక్కు పాదం.. 5.83 కేజీలు స్వాదీనం.!

ప్రొద్దుటూరు పోలీసులు గంజాపై ఉక్కు పాదం మోపుతున్నారు.  ఈ యేడాదిలో ఇప్పటివరకు 5.83 కేజీల గంజా స్వాదీనం చేసుకున్నారు.  గంజా, మత్తు పదార్థాలపై విద్యార్థులు, యువత, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
*ASP విభూకృష్ణ ఆధ్వర్యంలో ఈ యేడాదిలో ఇప్పటివరకు 15 ఎక్సైజ్ అండ్ గంజా కేసులు నమోదు చేశారు. 19 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 314 మద్యం బాటిళ్లు, 5.83 కేజీల గంజా స్వాదీనం చేసుకున్నారు.  రూరల్ పరిధిలో అక్రమ మద్యం, బెల్ట్ షాపులపై 11 కేసులు నమోదు చేసి, 12 మందిని అరెస్ట్ చేశారు.  అర్బన్ ఏరియాలో గంజాపై 4 కేసులు నమోదు చేసి, 7 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశారు.  వీటికి ప్రజలు దూరంగా ఉండాలని ASP విభుకృష్ణ సూచించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?