పనులు పూర్తయితే అభివృద్ధి కనిపిస్తుంది: MLA వరదరాజుల రెడ్డి
ప్రొద్దుటూరులో రూ.10.70 కోట్లతో చేపడుతున్న 49 అభివృద్ధి పనులకు ఆదివారం స్థానిక MLA వరదరాజుల రెడ్డి భూమిపూజ చేశారు. ఇందులో 15th ఫైనాన్స్ గ్రాంట్స్ వర్క్స్ 47, జనరల్ ఫండ్స్ వర్క్ 2 ఉన్నాయి. CC రోడ్లు-28, వాటర్ పైప్ లైన్ వర్క్స్-12, వాచ్మెన్ రూమ్స్-3, CC డ్రైన్స్& కల్వర్ట్స్-2, ట్రాక్టర్స్-2, కాంపౌండ్ వాల్-1, ఫ్లోరింగ్-1 వర్క్ చేపట్టారు. భూమిపూజ కార్యక్రమంలో టిడిపి నేతలు, అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.