వెళ్లాలలో రూ.4 కోట్లతో ఆలయాల అభివృద్ధి: MLA వరద
రాజుపాలెం మండలం వెళ్లాలలో రూ.4 కోట్లతో చెన్నకేశవ స్వామి ఆలయ ఆధునీకరణ పనులకు గురువారం పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే వెళ్లాలలో ఆంజనేయ స్వామి ఆలయాన్ని అత్యంత సుందరంగా ఆధునికరించినట్లు తెలిపారు. ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్ నుంచి ఆలయాల అభివృద్ధికి నిధులు ఇస్తోందన్నారు.
*ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తోట మహేశ్వర రెడ్డి, EO రమణ, దేవస్థాన చైర్మన్ లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ చైర్మన్లు రామసుబ్బారెడ్డి, కుమ్మరపల్లె వెంకటరామిరెడ్డి, TDP రాజుపాలెం మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, టిడిపి నేతలు, ఎండోమెంట్ అధికారులు పాల్గొన్నారు.