83 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి.. మహిళను వేధించిన కేసులో 3 ఏళ్లు జైలు శిక్ష.!

ప్రొద్దుటూరు: ఉద్యోగాల పేరుతో,  ప్రేమ పేరుతో మహిళలను వలలో వేసుకుని, ఆతర్వాత వేధించి, చంపుతానని బెదిరింపుల కేసులో చౌడూరు గ్రామానికి చెందిన అనిల్ కుమార్ రెడ్డికి పొద్దుటూరు కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఈ కేసును రూరల్ ఎస్సై రాజు కేవలం 83 రోజుల వ్యవధిలోనే దర్యాప్తు పూర్తి చేసి, పకడ్బందీ సాక్ష్యాలతో శిక్ష పడేలా చేశారు.
*కేసు వివరాల్లోకి వెళితే..  స్థానిక దొరసానిపల్లె గ్రామానికి చెందిన అవివాహిత అయిన ఒక మహిళ MCA వరకు చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో, 2026 ఫిబ్రవరి నెలలో రాజీవ్ నగర్‌లోని దస్తగిరి స్వామి వద్దకు జాతకం చూపించేందుకు వెళ్లింది. అక్కడ నిందితుడు పళ్ళపోతుల అనిల్ కుమార్ రెడ్డి ఆమెకు పరిచయమై, తన పరిచయాల ద్వారా ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు.
 అనంతరం ఉద్యోగం ఇప్పించే విషయాన్ని పక్కనపెట్టి, ప్రేమ పేరుతో ఫోన్ చేస్తూ, ఆమె వెంటపడుతూ వేధించాడు. ఆమె మందలించడంతో, ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే తనను, తన తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు 17.06.2026న ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, క్రైమ్ నం.173/2026 U/s 78, 351(2) BNS కింద కేసు నమోదు చేశారు.
నిందితుడి వివరాలు :- 
పళ్ళపోతుల అనిల్ కుమార్ రెడ్డి, 31 సంవత్సరంలు, తండ్రి. సాంబశివా రెడ్డి, చౌడూరు గ్రామం, ప్రొద్దుటూరు మండలం
 దర్యాప్తులో నిందితుడి పై ఆరోపణలు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించి, 19.06.2026 వ తేదీన నిందితుడు పళ్ళపోతుల అనిల్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి, చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి, సేకరించిన సాక్ష్యాధారాలు మరియు సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితుడిపై చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు.
 కేసు విచారణలో భాగంగా ప్రాసిక్యూషన్ సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరచడంతో పాటు, సంబంధిత దర్యాప్తు పత్రాలు మరియు సాక్ష్యాధారాలను కోర్టు ముందు సమర్పించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఫలితంగా కేసు స్వల్ప వ్యవధిలోనే విచారణ పూర్తయి, నిందితుడికి 3 సంవత్సరాల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.5,500/- జరిమానా, గౌరవనీయులైన I JFCM కోర్టు, ప్రొద్దుటూరు న్యాయమూర్తి కె. సురేంద్ర రెడ్డి గారు, II AJFCM కోర్టు, ప్రొద్దుటూరు ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వహిస్తూ తీర్పు వెలువరించారు. అనంతరం పోలీసులు నిందితుడిని కడప సెంట్రల్ జైలుకు తరలించి అప్పగించారు
*దర్యాప్తు వివరాల్లోకి వెళితే:* ఫిర్యాదు అందిన వెంటనే ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్‌ S.I. K.C.Raju గారు కేసు దర్యాప్తులో భాగంగా బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసి, కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించి, నిందితుడి పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సమగ్రంగా విచారణ చేపట్టి, త్వరగతిన గౌరవ న్యాయస్థానం లో ఛార్జ్ షీట్ దాఖలు చేయడమైనది. అరెస్ట్ అయినప్పటి నుండి సుమారు రెండు నెలలు పై గా ముద్దాయిని జుడిషియల్ కస్టడిలో ఉన్నాడు. ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ SI K.C. రాజు గారు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యుటర్ అయిన శ్రీ మతి లావణ్య గారు, కోర్టు కానిస్టేబుల్ PC. 2859 శ్రీనువాస యాదవ్ మరియు 2750 గంగా ప్రసాద్ గార్ల సహకారంతో సరైన సమయంలో సాక్షులను కోర్టులో హాజరు పరచి ముద్దాయికి శిక్షపడేటట్లు చేసినారు. ఈ కేసును నిండితుడికి నేర నిరూపణ లో కృషి చేసిన విచారణ అధికారి అయిన SI K.C. రాజుగారికి రూ. 1000/-, కోర్టు కానిస్టేబుల్స్ PC. 2859 శ్రీనువాస యాదవ్ and 2750 గంగా ప్రసాద్ గారుకి ఒక్కొక్కరికి రూ. 500/- రూపాయలు నగదు బహుమతిని ఇవ్వవలసినదిగా కోర్టు వారు కడప జిల్లా SP గారిని కోరడం అయినది.   
*నిందితుడి గత నేర చరిత్ర:-*
1) 2019 వ సంవత్సరంలో ప్రొద్దుటూరు రూరల్ P.S నందు ఒక రేప్ మరియు చీటింగ్ కేసు.
2) 2023 వ సంవత్సరం లో గుత్తి పోలీస్ స్టేషన్ నందు రేప్ మరియు పోక్సో కేసు.
3) 2025 వ సంవత్సరం లో మన్నూర్ పోలీస్ స్టేషన్ నందు ఒక మహిళా ఆత్మహత్య కు ప్రేరేపించిన కేసు.
దర్యాప్తు బృందం కృషి చేసింది
 ఈ మొత్తం దర్యాప్తు ప్రక్రియను ప్రొద్దుటూరు రూరల్ CI శ్రీ M. నాగభూషణ్ గారి సూచనలు మరియు పర్యవేక్షణలో SI K.C. రాజు, కోర్టు కానిస్టేబుళ్లు PC 2859 శ్రీనివాస యాదవ్, PC 2750 గంగా ప్రసాద్ సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించారు. కేసును స్వల్ప వ్యవధిలోనే ఛేదించి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రొద్దుటూరు ASP శ్రీ U. విభుకృష్ణ, IPS గారు అభినందించారు.
CI M. నాగభూషణ్ గారు మాట్లాడుతూ: మహిళలను ప్రేమ పేరుతో వేధించడం, వెంటపడటం, అసభ్యంగా ప్రవర్తించడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడే వారి పై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. మహిళలు తమకు ఎదురయ్యే వేధింపుల పై నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల భద్రతకు భంగం కలిగించే ఎలాంటి చర్యనైనా ఉపేక్షించేది లేదని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ప్రొద్దుటూరు రూరల్ సి.ఐ గారు హెచ్చరించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?