నేడే లోక్ అదాలత్.. జిల్లాలో 29 బెంచ్ లు ఏర్పాటు.!

ప్రొద్దుటూరు: జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహిస్తున్నారు.  ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 29 బెంచ్ లు ఏర్పాటు  చేశారు. కడపలో 8, ప్రొద్దుటూరులో 5, రాజంపేటలో 3, రాయచోటిలో 3, బద్వేల్ నందు 2, సిద్ధవటం, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, లక్కిరెడ్డిపల్లి, నందలూరు మరియు రైల్వే కోడూరు నందు ఒక్కొక్క బెంచిని ఏర్పాటు చేశారు.  కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ లో తమ కేసులను రాజీ చేసుకుని సత్వర న్యాయం పొందవచ్చునన్నారు.  ప్రొద్దుటూరులో మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జడ్జి సత్యకుమారి ఏర్పాట్లు చేశారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?