అర్థరాత్రి గొడవపై కేసు నమోదు: 2టౌన్ ఎస్సై రాఘవేంద్ర రెడ్డి
ప్రొద్దుటూరు గౌరమ్మ కట్ట వీధిలో సోమవారం రాత్రి జరిగిన దాడి ఘటనపై భార్గవ రెడ్డి, సంతోష్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు స్థానిక 2టౌన్ ఎస్సై రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి 11.45 గంటల సమయంలో రెండు కార్లు ఎదురెదురుగా దాటుకునే ప్రయత్నంలో కారులోని వ్యక్తులు ఘర్షణ పడుతుండగా, ధనుష్ కుమార్ అనే వ్యక్తి సర్దుబాటు చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ధనుష్ పై భార్గవరెడ్డి, సంతోష్ కుమార్ రెడ్డిలు కట్టెలతో దాడి చేశారు. ఈ దాడిలో ధనుష్ కంటికి దెబ్బ తగిలింది. ధనుష్ తండ్రి విజయకుమార్ ఫిర్యాదు మేరకు భార్గవ, సంతోష్ లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. వారిని త్వరలో గుర్తించి పట్టుకుంటామన్నారు. గణేష్ ఉత్సవాలకు ఈ దాడి ఘటనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. వదంతులను ప్రచారం చేయొద్దని, నమ్మద్దని పోలీసులు తెలిపారు.