లోక్ అదాలత్.. 172 కేసులు రాజీ.. రూ.5.89 కోట్లు పంపిణీ.!
ప్రొద్దుటూరు లోక్ అదాలత్ కోర్టులో శనివారం ఒక్క రోజే 172 కేసులు ఇరు వర్గాల రాజీతో పరిష్కారం అయ్యాయి. బ్యాంక్, ఫైనాన్స్, బీమా సంస్థలు, పోలీస్ అధికారులు, కక్షిధారుల రాజీ మేరకు రూ.5.89 కోట్లు పరిహారం ఇప్పించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ జడ్జి సత్యకుమారి ఆధ్వర్యంలో జడ్జీలు వెంకటేశ్వర్లు, షేక్ పైజునిస్స, ప్రతిభ, సురేంద్ర రెడ్డి బెంచ్ లు ఏర్పాటు చేశారు. కేసులు విచారించారు. తీర్పులు ఇచ్చారు.