నకిలీ పోలీసులు.. ఇదివరకే 13 కేసుల్లో ముద్దాయిలు: ఎస్సై రాజు
ప్రొద్దుటూరు: పోలీసులుగా చెప్పుకుంటూ, డబ్బులు వసూలు చేస్తున్న
శంకరాపురం సాయినాథరెడ్డి, చౌడూరు రవికుమార్ రెడ్డిలపై ఇదివరకే 13 పాత కేసులు ఉన్నాయని ప్రొద్దుటూరు రూరల్ ఎస్సై రాజు తెలిపారు. బుధవారం వారిపై మరో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి ఒక ఫైబర్ పోలీస్ లాటి, రూ.వెయ్యి నగదు, రూ.1.30 లక్షల విలువైన ఐఫోన్, పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. సాయి 3, రవి 10 పాత కేసుల్లో ముద్దాయిగా ఉన్నారన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.