ఎమ్మెల్యే చొరవతో 12 సంవత్సరాలకు ఆధార్ నమోదు.!
ప్రొద్దుటూరు పట్టణం మోడంపల్లె పేద ఎస్సీ కుటుంబానికి చెందిన రామలక్ష్మి, రామాంజనేయులు కుమార్తె పుట్లూరు పద్మ ప్రత్యేక పరిస్థితుల్లో 12 సంవత్సరాలుగా ఆధార్ కు నోచుకోలేదు. మల్టీపుల్ డిజార్డర్ & మెంటల్లీ రిటర్డెట్ తో పుట్టినప్పటి నుంచి మంచానికే పరిమితం. నిలబడలేని, కూర్చోలేని పరిస్థితి. ఆధార్ లేక పోవడంతో పెన్షన్, అంగన్వాడీ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేదు. సమస్యను స్థానిక MLA వరదరాజుల రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే
మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ కు ఆధార్ నమోదు చేయించాలని ఆదేశించారు. శనివారం కమిషనర్ ఆ బాలికకు ప్రత్యేక అనుమతితో 4 గంటలపాటు ప్రయత్నించి ఆధార్ నమోదు చేయించారు. 12 సంవత్సరాల సమస్యకు పరిష్కారం లభించింది.