పేకాట స్థావరంపై పొద్దుటూరు 1టౌన్ పోలీసుల దాడులు.

పొద్దుటూరు 1టౌన్ SI మధుసూదన్ రెడ్డి తన సిబ్బందితో
శుక్రవారం సాయంత్రం పేకాటపై దాడి చేశారు.
రామేశ్వరం సాయిబాబా గుడి వెనకవైపు ఉన్న ఖాళీ స్థలంలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
వీరు లోపల బయట అను జూదము ఆడుతుండగా రాబడిన సమాచారం మేరకు పేకాట శిబిరంపై దాడి చేసి పట్టుకోవడం జరిగిందని సీఐ కొండారెడ్డి తెలిపారు. పట్టుబడిన వారిలో 1. కుమారగారి రమేష్, 2. షేక్ మజీద్ భాష , 3. మోపురి రవీంద్రారెడ్డి, 4.సాలంకు ఉపేంద్ర, 5.సుంకేసుల గురు ప్రతాప్, 6.దూదేకుల మదార్ వల్లి ఉన్నారన్నారు.  వీరి నుండి రూ.22,870లు,  52 పేకముక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ కొండారెడ్డి తెలిపారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?