ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో RBI తనిఖీలు.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 5): ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో RBI అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.  విజయవాడ RBI కార్యాలయం నుంచి వచ్చిన ఇద్దరు ఆడిటింగ్ అధికారులు సోమవారం నుంచి మూడు రోజులుగా రికార్డులను పరిశీలిస్తున్నారు.  మరో రెండు రోజులపాటు ఈ తనిఖీలు జరగనున్నట్లు తెలిసింది.  బ్యాంకుపై ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే DLCO సత్యానంద్ ఆధ్వర్యంలో సహకార శాఖ అధికారులు బ్యాంకు రికార్డులను తనిఖీలు చేశారు.  కొన్ని సూచనలు చేశారు.  వెంటనే ఇప్పుడు RBI అధికారులు కూడా రికార్డుల పరిశీలన చేపట్టారు.  ఈ పరిస్థితుల్లో బ్యాంకులో ఏమి జరుగుతుందోనని ఖాతాదారులు ఆరా తీస్తున్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?