మస్కట్ లో చిక్కుకుపోయిన ప్రొద్దుటూరు మహిళ.. చంద్రబాబు, పవన్ హెల్ప్ చేయాలని వేడుకోలు.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 8): మస్కట్ దేశానికి వెళ్లి, హార్ట్ ప్రాబ్లం వచ్చి, షేట్ వద్ద పాస్పోర్ట్ చిక్కుకుపోయి, స్వదేశానికి తిరిగి రాలేక బాధిత తెలుగు మహిళలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెల్ప్ చేయాలని వేడుకుంటున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన శిరోమణి, ఉయ్యూరుకు చెందిన పద్మ ఏజెంట్ మాయమాటలు నమ్మి పని కోసం మస్కట్ వెళ్లారు. అక్కడ ఆరు నెలలు తర్వాత హార్ట్ ప్రాబ్లం ఇతర ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. షేట్ పాస్పోర్ట్ తిరిగి ఇవ్వడానికి రూ.2 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని, తమను స్వదేశానికి తీసుకురావాలని వారు వీడియో మెసేజ్ ద్వారా సీఎం, డిప్యూటీ సీఎంలను అభ్యర్థిస్తున్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.