ఎండోమెంట్ అధికారి శంకర బాలాజీని కటకటాల్లో పెట్టాలి: శ్రీనాథ్ రెడ్డి
ప్రొద్దుటూరు: అయోధ్య రామాలయంలో దేవుడి సొమ్ము తిన్న నిందితులను వారం రోజుల్లో జైలుకు పంపించారని.. ప్రొద్దుటూరు అగస్తేశ్వరాలయంలో రూ.62 లక్షలు తిన్న ఈఓ శంకర బాలాజీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని దేవాలయాల సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పుష్పాల శ్రీనాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోమవారం కడప కలెక్టరేట్ PGRSలో జేసీ నిధిమీనాకు ఫిర్యాదు చేశారు. దేవుడి సొమ్ము తిన్న వారిని శిక్షించడంలో చట్టం దేశమంతా ఒక్కటేనని, అయోధ్య రామాలయంలో దొంగలను జైలుకు పంపినట్లే.. ప్రొద్దుటూరులో శివుని సొమ్ము తిన్న శంకర బాలాజీని కూడా కటకటాల్లోకి నెట్టాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు. లేకపోతే హిందూ ఆలయాలకు దేవుళ్లకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు.