విధులకు ఆటంకం కలిగించడంపై జరిమానా.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 4): పోలీస్ విధులకు ఆటంకం కలిగించడంపై మంగళవారం ప్రొద్దుటూరు 1వ అదనపు 1st క్లాస్ మేజిస్ట్రేట్ ముగ్గురు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.5,500లు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. 1టౌన్ సీఐ కొండారెడ్డి సమాచారం మేరకు.. పీసీ రామకృష్ణ బైకులో వెళ్తుండగా షేక్ హుస్సేన్ బైకుతో డీ కొట్టాడు. ఆ సమయంలో అక్కడ కమాండ్ కంట్రోల్ విధుల్లో ఉన్న పీసీ ఉదయ కుమార్ వారి మద్య సర్దుబాటు చేశాడు. తర్వాత షేక్ హుస్సేన్, షేక్ అబ్దుల్ అలీం, షేక్ నాయబ్ రసూల్ ఉదయ కుమార్ వద్దకు వచ్చి బెదిరించారు. విధులకు ఆటంకం కలిగించారు. ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసి, కోర్టులో ఛార్జిషీట్ ఫైల్ చేశారు. మంగళవారం మేజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు.
-