బాలికల పాఠశాలను తనిఖీ చేసిన జడ్జీ.!
రాజంపేట(ఆగస్ట్,7): రాజంపేట ZP బాలికల పాఠశాలను శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్-కం-జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని ఆదేశాల మేరకు
తనిఖీ చేశారు.
*ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థినులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వంటశాలను, బాత్రూమ్ లను పరిశీలించారు. విద్యార్థినులు తెలిపిన సమస్యలు, ఇబ్బందులపై వివరంగా విచారణ నిర్వహించి, వారి ఫిర్యాదులకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. విద్యార్థినుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.