పబ్లిసిటీ పిచ్చితో సమస్యలు పట్టించుకోరా.!
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఆ అధికారి ప్రతిరోజూ సోషియల్ మీడియాలో ప్రచారం తప్ప, ఇక్కడి ప్రధాన సమస్యలైన కుక్కలు, పందులు, దోమలు బెడదను పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. రోడ్లపై గోతులు, కాల్వలు, కల్వర్టులకు కనీసం ప్యాచింగ్ సైతం చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఏ సమస్య చెప్పినా సాగదీయడం తప్ప పని చేయడం లేదని పిర్యాదుధారులు విమర్శిస్తున్నారు. .
*గత మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి హయాంలో 15th ఫైనాన్స్ గ్రాంట్స్ రూ.12 కోట్లకు పరిపాలన, సాంకేతిక అనుమతులు తెచ్చారు. ఆ నిధులతో రోడ్లు, కాల్వలు, కల్వర్టులు, త్రాగునీటి సరఫరా తదితర 59 పనులకు టెండర్లు పూర్తి చేయించారు. పనులను మొదలు పెట్టే సమయంలో ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. రూ.12 కోట్ల విలువైన 59 పనుల ఫైల్ ఆగిపోయింది. ముందుకు కదలలేదు.