సగం ఇన్నింగ్స్ పూర్తయినా సూపర్ సిక్స్ పూర్తి చేయవా బాబూ: తులసిరెడ్డి
ప్రొద్దుటూరు: సగం ఇన్నింగ్స్ పూర్తయినా సూపర్ సిక్స్ కొట్టేదెప్పుడంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా సెల్ అధ్యక్షుడు తులసిరెడ్డి ప్రశ్నించారు.
ఆయన ఆదివారం ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగ బృతి, ఆడబిడ్డ నిధి, 50 సంవత్సరాలకే పెన్షన్ ఎప్పుడిస్తావంటూ అడిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళైనా సూపర్ సిక్స్ హామీలు ఆచరణలోకి రాలేదన్నారు. సమావేశంలో స్థానిక పార్టీ నేతలు నజీర్, జిలానీ, గౌస్ తదితరులు పాల్గొన్నారు.