తండ్రి ఆస్తి హక్కులను పునరుద్ధరించిన ఆర్డీవో.!
ప్రొద్దుటూరు పట్టణం బొల్లవరంకు చెందిన రామిరెడ్డి తన యావదాస్తిని కుమారుల పేరున 2019లో రాసిచ్చాడు. ఆస్తి పొందిన కుమారులు తండ్రి పోషణను పట్టించుకోలేదు. దాంతో 88 సంవత్సరాల వృద్ధాప్యంలో తనను కుమారులు పట్టించుకోవడం లేదంటూ జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాడు. విచారణ జరిపిన ఆర్డిఓ శిరీష కుమారుల పేరున ఆస్తి రిజిస్ట్రేషన్ లను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డులో ఆస్తి యజమాన్య మార్పిడి చేయాలని ఆదేశించారు.