హెల్మెట్ ధారణపై అవగాహణ: రూరల్ ఎస్సై శ్రీకాంత్
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 8): టూ వీలర్స్ వాహనదారులకు హెల్మెట్ ధారణపై ప్రొద్దుటూరు రూరల్ ఎస్సై శ్రీకాంత్ అవగాహణ కల్పించారు. శనివారం స్థానిక కొత్తపల్లె వై జంక్షన్ వద్ద పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ.. చాలావరకు రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ప్రమాద తీవ్రతను తగ్గిస్తుందన్నారు. ప్రాణాలకు రక్షణగా ఉంటుందన్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని సూచించారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.