అక్కడ మూడు పార్టీలు ఉమ్మడిగా ప్రచారం.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 5): ప్రొద్దుటూరు MLA వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో BJP, జనసేన నేతలు బుధవారం కూటమి పాలనపై ప్రచారం నిర్వహించారు. స్థానిక ఆర్ట్స్ కాలేజీ రోడ్డు, వినాయక నగర్ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు. TNTUC జిల్లా అధ్యక్షుడు కుతుబుద్దీన్, మాజీ కౌన్సిలర్లు గాజుల శివజ్యోతి, పట్టుపోగుల పుల్లయ్య, వద్ది బాలుడు, చేనేత సంఘం ఉప్పు మల్లికార్జున, BJP అధ్యక్షుడు నరేంద్ర, జనసేన మురళీ పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.