శివాలయంలో సహస్ర ఘటాభిషేకం.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 5): స్థానిక శివాలయంలో బుధవారం అగస్త్యేశ్వర స్వామికి సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించారు. 108 కడవలతో 1000 సార్లు ఘట్టాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రదక్షిణ, గోపూజ, గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, పంచగవ్యం, విరాటపర్వ పారాయణం నిర్వహించారు. కడవలతో నీళ్లు తీసుకొని ఆలయ తిరుమాడవీధులలో ప్రదక్షిణ చేశారు. ఆలయ చైర్మన్ నారాయణరెడ్డి, కమిటి సభ్యులు, అర్చకులు, వేదపాఠశాల విద్యార్థులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.