రెంట్ కడతారా.. వెకేట్ చేస్తారా.! శివాలయం చైర్మన్ వార్నింగ్
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 5): శివాలయానికి బాడుగలు చెల్లించకుండా ఆస్తులు అనుభవించడం మంచిది కాదని బాడుగధారులకు ఆలయ చైర్మన్ నారాయణరెడ్డి హెచ్చరించారు. ఆలయానికి స్థానిక వినాయకనగర్ వీధిలో 25 సెంట్లు స్థలం ఉంది. ఇందులో నివాసాలున్న వారు ఆలయానికి బాడుగలు చెల్లించడం లేదు. వారితో బుధవారం ఆలయ చైర్మన్ సమావేశం నిర్వహించారు. బాడుగలు చెల్లిస్తారా, ఖాళీ చేసి వెళ్ళిపోతారా అని ఘాటుగా హెచ్చరించారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.