ప్రొద్దుటూరు అభివృద్ధిపై నేడు జిల్లా కలెక్టర్ సమీక్ష.!
ప్రొద్దుటూరు అభివృద్ధిపై మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ సమీక్ష నిర్వహించనున్నారు. కడపలో సాయంత్రం 3 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని అన్ని విభాగాల అధికారులు ప్రగతి నివేదికలతో సమావేశానికి హాజరవ్వాలని ఆదేశించారు. గత సమావేశం తీర్మానాలు, ఆదేశాల అమలుపై సమావేశంలో సమీక్షించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు.