రోడ్డు ప్రమాదంలో దన్నవాడ వాసులకు గాయాలు.!
ప్రొద్దుటూరు: స్థానిక జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో ఆదివారం సాయంత్రం లారీని ఓవర్టేక్ చేయబోయి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం దన్నవాడ గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ వెళ్ళిపోయాడు. శ్రీనివాసులు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాధమిక చికిత్స తీసుకొని, ప్రవేట్ ఆస్పత్రికి వెళ్లారు.