కార్పోరేట్ దుకాణాలను తరిమేస్తాం: మాజీ ఎమ్మెల్యే
ప్రొద్దుటూరులోంచి కార్పోరేట్ దుకాణాలను తరిమేస్తామని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నెలలోపు సెలూన్ మొదలుకొని జ్యూవెలరీ వరకు దుకాణాలను బంద్ చేసుకొని వారంతకువారే వెళ్లిపోవాలన్నారు. లేకపోతే వైసీపీ కార్యకర్తలతో కార్పొరేట్ దుకాణాల వద్ద ఆందోళనలు చేసి, పంపిస్తామన్నారు.