ప్రొద్దుటూరు(జూలై, 31): ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇంచార్జ్ చైర్మన్ గా పట్నం లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్ వద్ది సురేఖ రాజీనామాకు స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అంగీకారం తెలిపారు. శుక్రవారం రాజీనామా లేఖను మార్కెట్ కమిటీ సెక్రటరీ రత్నరాజు ప్రభుత్వానికి పంపించారు. వైస్ చైర్మన్ లక్ష్మణ్ ఇంచార్జ్ చైర్మన్ గా కొనసాగించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆయన సెప్టెంబర్ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. - ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.
ప్రొద్దుటూరు(జూలై, 27): స్థానిక కొత్తపల్లె పంచాయతీని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేయాలని టిడిపికి చెందిన లింగాపురం బ్యాంక్ చైర్మన్ నాగముని రెడ్డి, సినీహబ్ రాజేశ్వరరెడ్డి సూచించారు. వారు సోమవారం పొద్దుటూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మునిసిపల్ కార్పొరేషన్లో ప్రజలకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. అభివృద్ధి జరుగుతుందన్నారు. కరెప్షన్ తగ్గుతుందన్నారు. ప్రజలంతా విలీనానికి మద్దతుగా ఉన్నారు. కొంతమంది అభివృద్ధి నిరోధకుల ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. - ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.
పొద్దుటూరు(జూలై, 22): స్థానిక శ్రీనివాసనగర్ వివాదాస్పద విద్యుత్ సబ్ స్టేషన్ స్థలాన్ని బుధవారం విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. స్థల వివాదంపై ఆరా తీశారు. 80% పూర్తయిన సబ్ స్టేషన్ నిర్మాణం పనులను అధికారులు ఆపారు. మిగతా 20% పనులు పూర్తి చేసి సబ్ స్టేషన్ ప్రారంభించాలంటూ స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఈనెల 25న ధర్నాకు పిలుపునిచ్చారు. - ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.