మత్తు పదార్థాలకు దూరం: ప్రొద్దుటూరు సీఐ కొండారెడ్డి
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 6): స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాలలో గురువారం CI కొండారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒత్తిళ్లు, సమస్యలను పేరెంట్స్, టీచర్స్ వద్దకు తీసుకెళ్లాలన్నారు. మంచి పౌరులుగా ఎదగాలన్నారు. పాఠశాల HM, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.