ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ లీకు వీరులెవ్వరు.?

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 2): ప్రొద్దుటూరు సహకార టౌన్ బ్యాంకుకు ఘన చరిత్ర ఉంది.  ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలను ఎదుర్కొని నిలబడింది.  అప్పట్లో ఎన్నో పేరు మోసిన సహకార బ్యాంకులు మూతపడ్డా.. ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ మాత్రం ఖాతాదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వచ్చింది.  బ్యాంకు శాఖలను ఎర్రగుంట్ల, కడప, బద్వేల్ ప్రాంతాలకు విస్తరిస్తూ వచ్చింది.  అప్పటి పాలకవర్గాలు, అధికారులు ఆర్థిక క్రమశిక్షణతో బ్యాంకును అభివృద్ధిలోకి తీసుకువచ్చారు.  
*ఇటీవల బ్యాంకులో జరిగే ప్రతి విషయన్ని పాలకవర్గంలోని, ఉద్యోగుల్లోని కొందరు లీకులు ఇస్తున్నారు.  డిపాజిట్ దారులు, రుణగ్రహీతల వివరాలను బయటికి చేరవేస్తున్నారు.  పాలకవర్గంలోని ముఖ్యుడొకరు SS మాల్ బ్యాంకు రుణాల రికార్డులను టీడీపీ నేత ప్రవీణ్ కు చేరవేసి, బ్యాంక్ విశ్వసనీయతను బజారున పెట్టాడని బ్యాంకులోని వారే గుసగుసలాడుతున్నారు.  ఈ లీకులతో టీడీపీలోని రెండు వర్గాలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నారు.  పార్టీ అధిష్టానం వరకు పంచాయతీ వెళ్ళింది.
*ఈ పరిస్థితుల్లో ఇటీవల స్థానిక టిడిపి ముఖ్య నేతలు బ్యాంకు పాలకవర్గం, అధికారులను పిలిపించి, లీకులపై విచారించి, వివరణ కోరినట్లు తెలిసింది.  బ్యాంకులో వ్యక్తిగత వ్యవహారాలు, పనులపై తీవ్రంగా మందలించినట్లు తెలిసింది.
*ఇది జరిగాక కూడా మళ్లీ తాజాగా RBI అధికారులు బ్యాంకు తనిఖీకి వస్తున్న సమాచారాన్ని లీకు వీరులు బయటికి చేరవేయడంపై సీరియస్ గా ఉన్నారు. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!