అనారోగ్యంతోనే రాజీనామా: వద్ది సురేఖ
పొద్దుటూరు(ఆగస్ట్, 1): తన భార్య వద్ది సురేఖ అనారోగ్య కారణాలతోనే పొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారని ఆమె భర్త బాలుడు తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తమ రాజీనామాలో ఆర్థిక, రాజకీయ కారణాలు లేవన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు, టిడిపికి నేత ప్రవీణ్ తమ రాజీనామాను రాజకీయం చేస్తున్నారన్నారు. అప్పట్లో తమకు ఏఎంసి పదవి రాకుండా ప్రత్యర్థులు అడ్డుకున్నారన్నారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గట్టిగా పట్టుబట్టి చంద్రబాబు, లోకేష్ లను ఒప్పించి తమకు పదవి ఇప్పించారన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.