స్విగ్గీ బాయి.. బైకులు జాగ్రత్త.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 2): స్విగ్గీ డెలివరీ బాయిగా ఇంటింటికి వెళ్తూ బైకులను కొట్టేసిన స్థానిక పెన్నానగర్ కు చెందిన సూర్య గురుతేజను సోమవారం స్థానిక 1టౌన్ సీఐ కొండారెడ్డి, ఎస్సై శ్రీనివాసులు అరెస్ట్ చేశారని ASP విభుకృష్ణ తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నిందితుని నుంచి చోరీకి గురైన 7 బైకులు రికవరీ చేశామన్నారు. వాటి విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉంటుందన్నారు.
*వాహనదారులు తమ వాహనాలకు సేప్టీ లాక్ వేసుకోవాలన్నారు. CC కెమెరాలు, రక్షిత ప్రాంతాల్లో పార్కింగ్ చేయాలన్నారు.
-ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.