ఉపాద్యాయుల సమస్యలపై సమరభేరి: APTF శ్యాంసుందర్ రెడ్డి
ప్రొద్దుటూరు: ఉపాద్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై సమరభేరి మోగిస్తున్నట్లు APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి హెచ్చరించారు. ఆయన ఆదివారం ప్రొద్దుటూరులో యూనియన్ సమావేశంలో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2నుంచి మంగళగిరి విద్యాభవన్ వద్ద నిరవదిక ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. రెండున్నర ఏళ్లుగా ప్రభుత్వాన్ని అడుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇక పోరాటాలు తప్పవన్నారు. పెద్ద ఎత్తున ఉపాద్యాయులు తరలిరావాలని పిలుపునిచ్చారు.