హత్యాయత్నం కేసులో జరిమానా.!
హత్యాయత్నం కేసులో ముద్దాయికి 5000 వేల రూపాయల జరిమానా.
ఫిర్యాది: దుద్యాల చంద్రమహేశ్వర్ రెడ్డి s/o శివా రెడ్డి, పర్లపాడు గ్రామం, రాజుపాలెం మండలం.
ముద్దాయి: గంగిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి, 28 సంవత్సరాలు తండ్రి వెంకటలక్ష్మి సుబ్బారెడ్డి, పర్లపాడు గ్రామం, రాజుపాలెం మండలం.
కేసు వివరాలు: రాజుపాలెం మండలం పర్లపాడు గ్రామం నందు ఫిర్యాది కి మరియు ముద్దాయికి ఇంటి వద్ద గోడకు సంబంధించిన తకరారు విషయమై మనస్పర్ధలున్నాయి. 09.01.2019 ఉదయం 8:30 గంటలకు ఫిర్యాదుదారు భార్య అయిన నాగమణి తన ఇంటి దగ్గర ఉండగా మనసులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా ముద్దాయి యొక్క మోటార్ సైకిల్ ను అడ్డంగా పెట్టి నాగమణి అటు గా పోతూ ఉండగా బకెట్ తగిలిందని ఉద్దేశపూర్వకంగానే గొడవ పెట్టుకొనగా ఫిర్యాదుదారు నా భార్యను ఎందుకు తిడుతున్నావు అని అడగగా ముద్దాయి జగన్మోహన్ రెడ్డి నీకోసమే రా నేను నిన్ను చంపాలనే కావాలని గొడవ పెట్టుకున్నాను అని ముందుగానే తన వద్ద ఉన్న గొడ్డలితో ఫిర్యాదుని తలపై నరకగా రక్త గాయాలైనవి.
*సదరు విషయం గురించి రాజుపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ ఐ గారు
రాజుపాలెం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 4/19 U/S 307 IPC గా కేసు నమోదు చేసి కేసును దర్యాప్తు చేసి ముద్దాయి ని అరెస్టు చేసి చార్జిషీట్ ఫైలు చేసినారు.
*ఈ కేసును ప్రొద్దుటూరు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి శ్రీమతి షేక్.Faizennisa గారు విచారణ చేసి ముద్దాయి పై నేరం నిరూపణ కావడంతో ముద్దాయికి 5000 రూపాయలు జరిమానా విధించినారు.
*ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున సమర్థవంతంగా వాదనలు వినిపించిన అడిషనల్ PP C. గుర్రప్ప గారిని , అప్పటి SI M. శ్రీనివాసులు గారిని , సకాలంలో సాక్షులను హాజరు పరిచిన ప్రస్తుత SI G. Prany kumar reddy గారిని కోర్టు మానిటరింగ్ సెల్ హెడ్ కానిస్టేబుల్ 1472 ఎన్. సంజీవ్ కుమార్, రాజుపాలెం పీఎస్ కోర్ట్ కానిస్టేబుల్ PC-2611 K. వీర శేఖర్ గారిని కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ IPS గారు సిబ్బందిని అభినందించినారు.