యానాది కాలనీలో తనిఖీలు.. 40 వాహనాలు సీజ్.!
ప్రొద్దుటూరు: స్థానిక యానాది కాలనీలో సోమవారం పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల ఇళ్లలో అణువణువు సోదాలు చేశారు. అక్కడి వాహనాల రికార్డులను సైతం పరిశీలించారు. సరైన పత్రాలు లేని 40 వాహనాలు సీజ్ చేశారు. 38 బైకులు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.
ASP విభుకృష్ణ పర్యవేక్షణలో సీఐలు నాగభూషణ్, కొండారెడ్డి, వంశీనాథ్, రామాంజనేయుడు సిబ్బంది పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు ASP విభుకృష్ణ తెలిపారు.