31 నుంచి మున్సిపల్ ప్లాట్ల వేలం.!
ప్రొద్దుటూరు: ఈనెల 31 నుంచి మున్సిపల్ బొల్లరం ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ శనివారం తెలిపారు. మున్సిపాలిటీకి చెందిన బొల్లవరంలోని 518 ప్లాట్లలో.. మొదటి దశలో 124 ప్లాట్లను భూ కొనుగోలు పోర్టల్ ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు దారులు సోమవారం నుంచి ఆన్లైన్లో ఈఎండి చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 23న ఈ-యాక్షన్ నిర్వహిస్తామన్నారు.