జాబ్ మేళాలో 157 మందికి నియామక పత్రాలు.!
కడప(ఆగస్ట్, 7): కడపలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిపిన మెగా జాబ్ మేళాలో సుమారు 20 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. 306 మంది ఇంటర్వ్యూలకు హాజరైనారు. వీరిలో సుమారు 154 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ & స్కిల్ ఆఫీసర్ సురేష్ కుమార్, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ విజయ్ వినీల్, కళాశాల చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.