రేపు పోతురాజు గడ్డకు 108 కలశాలతో శోభాయాత్ర.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 8): నేడు పోతురాజు గడ్డకు 108 కలశాలతో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు BJP పట్టణ అధ్యక్షుడు నరేంద్ర తెలిపారు. సంవృద్ధిగా వర్షాలు కురవాలనే సంకల్పంతో పోతురాజు గడ్డకు జలాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శివాలయం నుంచి చెన్నకేశవ స్వామి ఆలయం వరకు 108 కలశాలతో మహిళలు శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. VHP ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.